: భర్త ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతి నివాళి!... ‘హోదా’ కోసం చంద్రబాబు పోరాడాలని డిమాండ్!


తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని దేశ రాజధాని ఢిల్లీ నడి వీధుల్లో చాటిన దివంగత సీఎం నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి కొద్దిసేపటి క్రితం భర్తకు నివాళి అర్పించారు. అనుచరులతో కలిసి కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకున్న లక్ష్మీపార్వతి భర్తకు కన్నీటి నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం ఉందన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాగేసుకున్న చంద్రబాబు... పార్టీని దొంగల పార్టీగా మార్చేశారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై పోరు సాగించాలని ఆమె డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News