: ద్వివేదీ, రైనా అవుట్...గుజరాత్ 32/2
ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా ఫైనల్లో బెర్తు కోసం గుజరాత్ లయన్స్, సన్ రైజర్స్ హైదరాబాదు జట్ల మధ్య మొహాలీ వేదికగా పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముస్తాఫిజుర్ స్థానంలో బోల్ట్ కు స్ధానం కల్పించింది. రెండు జట్లకు గోల్డెన్ ఛాన్స్ కావడంతో గెలుపే లక్ష్యంగా బరిలో దిగాయి. బౌలింగ్ ప్రారంభించిన భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్ చివరి బంతికి ద్వివేదీ (5)ని పెవిలియన్ కు పంపాడు. అనంతరం మెక్ కల్లమ్ ఇన్నింగ్స్ గేర్ మార్చాడు. బౌండరీలతో స్కోరు బోర్డుకు వేగం తెచ్చే ప్రయత్నం చేస్తుండగా, రైనా (1) ను అద్భుమైన కట్టర్ తో బోల్ట్ పెవిలియన్ కు పంపాడు. దీంతో ఐదు ఓవర్లు ఆడిన గుజరాత్ లయన్స్ రెండు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. మెక్ కల్లమ్ (4), దినేష్ కార్తిక్ (19) క్రీజులో ఉన్నారు.