: దర్శకుడు వర్మతో నాకు ఎటువంటి విభేదాలు లేవు: బిగ్ బీ అమితాబ్ బచ్చన్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో తనకు ఎటువంటి విభేదాలు లేవని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ జవాబిచ్చారు. వర్మతో కలిసి సర్కారు-3 సినిమాను తీయనున్నట్లు అమితాబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ కుటుంబ స్నేహితుడే సర్కారు-3 సినిమాను నిర్మించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగానే వర్మతో విభేదాలున్నాయా? అని ప్రశ్నించగా బిగ్ బీ ఖండించారు. వర్మ తనకు మంచి స్నేహితుడని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం 'టీఈ3ఎన్' సినిమాలో అమితాబ్ నటిస్తున్న విషయం తెలిసిందే.