: పోసాని కృష్ణమురళీకి బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులు... పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫిర్యాదు చేశారు. నేటి సాయంత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చిన పోసాని...నరేష్ అనే వ్యక్తి డబ్బులు కావాలని వేధిస్తున్నాడని, తాను అంగీకరించకపోవడంతో నోటికొచ్చినట్టు తిడుతున్నాడని, ఆయన నోటి వెంట వచ్చే మాటలను తాను భరించలేకపోతున్నానని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆయనతో మాట్లాడతామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినీ రచయిత, దర్శకుడిగా ఆకట్టుకున్న పోసాని, నటుడిగా మారి, బిజీ అయిన సంగతి తెలిసిందే.