: ‘ఖతర్’లో అతిపెద్ద మల్టీ ప్లెక్స్ ప్రారంభం


ఖతర్ దేశంలోనే అతి పెద్ద మల్టీ ప్లెక్స్ ప్రారంభమైంది. ఈ దేశంలోనే అతిపెద్ద సినిమా ఆపరేటర్ అయిన ఖతర్ బహ్రయిన్ ఇంటర్నేషనల్ సినిమా (క్యూబీఐసీ) సినీకో 13 పేరుతో మల్టీ ప్లెక్స్ ను ప్రారంభించింది. ఇందులో మొత్తం 13 స్క్రీన్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 2,200 కు పైగానే ఉంటుంది. మొత్తం 13 స్క్రీన్లలో రెండు వీఐపీ థియేటర్లు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా క్యూబీఐసీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఖలీల్ అమిన్ మాట్లాడుతూ, అత్యాధునిక సాంకేతికతతో 13 స్క్రీన్లను నిర్మించామన్నారు. అరబిక్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలను ప్రదర్శిస్తామని చెప్పారు. కాగా, ఈ అతిపెద్ద మల్లీ ప్లెక్స్ ను నిన్న ప్రారంభించారు.

  • Loading...

More Telugu News