: కేంద్ర మంత్రి వర్గ విస్తరణ... సుబ్రహ్మణ్యస్వామికి మంత్రి పదవి?


త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, మంత్రి వర్గ విస్తరణ ఖాయమని, ఇంకా తేదీ ఖరారు చేయలేదని అన్నారు. మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయని ఆయన తెలిపారు. నిన్నటి వరకు కేంద్ర మంత్రిగా వున్న శర్బానంద సోనోవాల్ అసోం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నేపధ్యంలో ఆయన స్థానం ఖాళీ అయిందని, అలాగే మిత్రపక్షాలకు సంబంధించి కూడా సర్దుబాట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. తాజాగా కేంద్ర మంత్రుల పనితీరుపై ర్యాంకులు విడుదలైన సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ ను రకరకాల ఆరోపణలతో నిత్యం వేధిస్తున్న సుబ్రహ్మణ్యస్వామికి కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీ నుంచి కేంద్ర కేబినెట్ లో మరింత మందికి చోటుకల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News