: నెహ్రూను ప్రశంసించినందుకు కలెక్టర్ పై బదిలీ వేటు


భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసించిన ఒక కలెక్టర్ పై బదిలీ వేటు పడిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అజయ్ సింగ్ గంగ్వార్ వారం రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ చేశాడు. ఇందులో, జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసిస్తూ ఈ పోస్ట్ లో ఆయన రాశారు. నెహ్రూ సెక్యులర్ తత్వం, ఇస్రో, ఐఐటీ, బార్క్, ఐఐఎస్బీ, ఐఐఎం, బీహెచ్ఈఎల్, థర్మల్ ప్రాజెక్టులు, డ్యామ్ లు వంటివి నెహ్రూ హయాంలో నిర్మించారని అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో, అజయ్ సింగ్ ఆ పోస్ట్ ను తీసివేశారు. అయితే, ఈ పోస్ట్ విషయమై బీజేపీ నేత విన్ఆస్ సారంగ్ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే విధంగా ఈ పోస్ట్ ఉందని ఆరోపించారు. రాజకీయ అంశాలపై అధికారులు కామెంట్లు చేయరాదన్న నియమాన్ని ఆయన ఉల్లంఘించారని విచారణాధికారులు ఫైనల్ గా తేల్చి అజయ్ సింగ్ గంగ్వార్ పై బదిలీ వేటు వేశారు.

  • Loading...

More Telugu News