: అరాచక శక్తుల వెనుక వైఎస్సార్ కుటుంబసభ్యుల హస్తం: చంద్రబాబు ఆరోపణ


నవ్యాంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ అరాచక శక్తులు చెలరేగినా వారి వెనుక వైఎస్సార్ కుటుంబ సభ్యుల హస్తం ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. టీడీపీ నేత పరిటాల రవీంద్రను హత్య చేసినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని అసెంబ్లీలోనే తాను నిలదీశానని అన్నారు. పరిటాల రవిని అప్పటి ప్రభుత్వమే హత్య చేయించిందని ఆరోపించారు. ఏపీలో అభివృద్ధిని కుంటుపడేలా చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని నెలల క్రితం జరిగిన తుని ఘటన వెనుక కొన్ని రాజకీయశక్తులు ఉన్నాయని ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న నేతలు ప్రజలను, నాయకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మహానాడు వేదికగా చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News