: వాగ్వాదానికి వచ్చేందుకు రూ. 67 కోట్లు అడిగిన డొనాల్డ్ ట్రంప్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఒక డిబేట్ లో పాల్గొనేందుకు 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 67 కోట్లు) అడిగి, తానెంతటి వ్యాపారవేత్తనో చెప్పకనే చెప్పారు. డెమోక్రాట్ల తరఫున పోటీపడతారని భావిస్తున్న హిల్లరీ క్లింటన్ తో పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న బెర్నీ సాండర్స్ తో వాగ్వాదానికి సిద్ధమా? అని మీడియా ప్రశ్నించగా, డబ్బిస్తే సిద్ధమని, దాన్ని చారిటీకి వాడుతానని అన్నారు. మీడియా వ్యాపార ఎత్తులు తనకు తెలుసునని, సాండర్స్ తో తాను వాగ్వాదానికి దిగితే, చాలా మంచి రేటింగ్ ఉంటుందని చెప్పారు. సాండర్స్ తనకు స్నేహితుడని, ఆయనతో వాగ్వాదం తనకూ ఇష్టమేనని చెప్పారు. ఇక వీరిద్దరి మధ్యా డిబేట్ పెట్టి, ట్రంప్ కు రూ. 67 కోట్లు ఇచ్చే మీడియా సంస్థ ఎప్పుడు ముందడుగేస్తుందో చూడాలి.