: తుమ్మల ప్లేస్ లో తెలంగాణ శాసనమండలికి ఫరీదుద్దీన్!
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నిన్న పార్టీ నేతలు వెంటరాగా అసెంబ్లీకి వెళ్లిన ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇటీవల ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తమ్మల బంపర్ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుమ్మల ఖాళీ చేసిన ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కుతుందన్న విషయంపై సస్పెన్స్ కొనసాగింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ టీఆర్ఎస్ నిన్న కీలక ప్రకటన చేసింది. మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ను తుమ్మల స్థానంలో శాసనమండలికి పంపనున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది.