: అప్పన్న దేవాలయం లిఫ్ట్ లో ఇరుక్కున్న అల్లు అర్జున్... గందరగోళం!


సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలని వచ్చి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ లిఫ్ట్ లో చిక్కుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఉదయం సింహాచలానికి వచ్చిన అల్లు అర్జున్, కొంతమంది అభిమానులు, పోలీసుల భద్రత మధ్య ఆలయానికి వచ్చారు. అక్కడి లిఫ్ట్ లో ఎక్కిన వేళ, రెండు అంతస్తుల మధ్య లిఫ్ట్ ఆగిపోయింది. ఆ వెంటనే స్పందించిన ఆలయ అధికారులు, లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరిచి అల్లు అర్జున్ ను బయటకు తీసుకు వచ్చారు. ఆపై ఆయన స్వామివారి దర్శనానికి వెళ్లారు. లిఫ్ట్ కెపాసిటీకి మించి బరువు పెరగడం వల్లే అది ఆగిపోయిందని సమాచారం. ఈ ఘటనతో అల్లు అర్జున్ ను చూసేందుకు గుడి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురయ్యారు.

  • Loading...

More Telugu News