: నీట్ ఆర్డినెన్స్ పై స్టేకు సుప్రీం నో!... పిటిషన్ ను తోసిపుచ్చిన వైనం
దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ పై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను నిలుపుదల చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ పై స్టే విధించాలని కోరుతూ ఓ మెడికో నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై కొద్దిసేపటి క్రితం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ప్రస్తుత తరుణంలో ఆర్డినెన్స్ పై స్టే విధిస్తే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో అయోమయం నెలకొనే ప్రమాదం ఉందని చెప్పిన సుప్రీంకోర్టు... సదరు పిటిషన్ ను తోసిపుచ్చింది.