: బావ అడుగుల్లోనే బాలయ్య!... మహానాడు వేదిక వద్దకు చేరిన చంద్రబాబు, బాలకృష్ణ
తిరుమల వెంకన్న పాదాల చెంత తిరుపతిలో టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’ సందడి నెలకొంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న మహానాడు వేదిక వద్దకు కొద్దిసేపటి క్రితం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన చంద్రబాబు వేదికనెక్కారు. ఇక అప్పటిదాకా ఎవ్వరికీ కనిపించని నందమూరి నటసింహం, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ... చంద్రబాబు అక్కడికి రాగానే ప్రత్యక్షమైపోయారు. బావ చంద్రబాబు అడుగులో అడుగేసుకుంటూ ఆయన మహానాడు ప్రాంగణంలోకి ఎంటరయ్యారు.