: విజయవాడ లయోలాలో ర్యాగింగ్ భూతం... రాలిన మరో విద్యా కుసుమం!


కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ అన్న మాట వినపడకుండా చేస్తామన్న ప్రభుత్వాల మాటలు నీటిపై రాతలేనని మరోమారు రుజువయ్యాయి. విజయవాడలోని లయోలా కాలేజీలో ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఇంటర్ చదువుతున్న కమల్ జైన్ అనే విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధించడంతో, మనస్తాపంతో గత రాత్రి హాస్టల్ లో ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. సీనియర్లు కమల్ ను నిత్యమూ ఏడిపించేవారని, అతని సెల్ ఫోన్ లాక్కొని వేధిస్తుండేవారని విద్యార్థులు చెబుతున్నారు. కాగా, తమ కాలేజీలో ర్యాగింగ్ జరగలేదని లయోలా యాజమాన్యం చెబుతోంది. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News