: మెస్సీని దాటేసిన కోహ్లీ!... మోస్ట్ మార్కెటబుల్ ప్లేయర్స్ జాబితాలో థర్డ్ ప్లేస్ లో విరాట్!
టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలకడైన ప్రదర్శనతో సత్తా చాటుతున్నాడు. టెస్టు, వన్డే, టీ20... ఫార్మాట్ ఎదైనా కోహ్లీ బ్యాటు నుంచి పరుగుల వరద పారుతోంది. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ లో అతడు సత్తా కలిగిన క్రికెటర్ గా రాణిస్తున్నాడు. తాజాగా అతడు మరో అరుదైన ఘనతను సాధించాడు. ‘మోస్ట్ మార్కెటబుల్ ప్లేయర్స్’ జాబితాలో మూడో స్థానానికి ఎగబాకిన కోహ్లీ... విశ్వవ్యాప్తంగా మంచి ప్రజాదరణ ఉన్న లియోనెల్ మెస్సీని దాటేశాడు. ‘స్టోర్ట్స్ ప్రో’ నిన్న వెల్లడించిన ఈ జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో ఉండగా, బాస్కెట్ బాల్ క్రీడాకారుడు స్టీఫెన్ కరె తొలిస్థానంలో ఉన్నాడు. ఫ్రెంచ్ ఫుట్ బాల్ క్రీడాకారుడు పాల్ పోగ్బా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మెస్సీ ఈ జాబితాలో 27 వ స్థానానికి పడిపోయాడు. ఇక ఈ జాబితాలో తొలి 50 మందిలో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు కూడా చోటు దక్కింది.