: రికార్డు పుటలకెక్కనున్న వెంకయ్య!... నేడు రాజ్యసభకు బీజేపీ నేత నామినేషన్!


బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించనున్నారు. వరుసగా నాలుగు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ నేతగా ఆయన తన పేరిట రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన వెంకయ్యనాయుడు... తాజాగా నాలుగో పర్యాయం కూడా ఆ రాష్ట్రం కోటా నుంచే పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ మేరకు నేడు బీజేపీ సర్కారు విజయోత్సవాల్లో భాగంగా బెంగళూరు కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు కర్ణాటక రాజధానికి రానున్న వెంకయ్య పనిలో పనిగా రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేయనున్నారు. కర్ణాటకలో సరిపడినంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు వెంకయ్య ఎన్నికల లాంఛనమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News