: చర్చకు మేం రెడీ!... దమ్ముంటే రండి!: వెంకయ్యకు రఘువీరా సవాల్!


ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందజేసిన సహకారంపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ నిన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేసిన సవాల్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రతి సవాల్ విసిరారు. వెంకయ్య సవాల్ ను తాను స్వీకరిస్తున్నట్లు రఘువీరా కొద్దిసేపటి క్రితం అనంతపురంలో ప్రకటించారు. సమయం, స్థలం నిర్ణయం వెంకయ్యకే వదిలేస్తున్నట్లు ఆయన కాస్తంత ఘాటుగానే స్పందించారు. వెంకయ్యకు దమ్ముంటే చర్చకు రావాలని కూడా రఘువీరా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News