: నేను రాజ్యసభకు వెళతానని ఎన్నడూ అనుకోలేదు: కెప్టెన్ లక్ష్మీకాంతారావు
‘నేను రాజ్యసభకు వెళతానని ఎన్నడూ అనుకోలేదు’ అని టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు. టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపేందుకు ఆయన పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కెప్టెన్ లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కు ఏ విధంగా కృతఙ్ఞతలు చెప్పాలో తనకు అర్థం కావట్లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం తాము నడచుకుంటామని ఆయన అన్నారు. కాగా, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు టీఆర్ఎస్ తరపున కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, డి.శ్రీనివాస్ లను రాజ్యసభకు పంపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.