: ప్రపంచంలో అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతోన్న దేశం భారత్: యూపీ సభలో రాజ్‌నాథ్
దేశంలో ఎన్డీఏ పాలనకి నేటికి రెండేళ్లు నిండిన సందర్భంగా యూపీలో ఈరోజు ప్రారంభించిన విజయోత్సవ సభలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. రెండేళ్ల క్రితం భాజపాకు భారీ విజయాన్నందించారని రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. రెండేళ్ల పాలనలో పూర్తి పారదర్శకత తీసుకొచ్చామన్నారు. ప్రతీ పంచాయతీ అభివృద్ధికి, నగరాల ఆధునికీకరణకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామని ఉద్ఘాటించారు. ‘ప్రజలు మా పక్షాన ఉన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల జీవితాల్లో వెలుగు చూడాలన్నదే ప్రధాని మోదీ ధ్యేయమని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో పాలనలో ఉన్న కాంగ్రెస్‌కి ప్రజలు చరమ గీతం పాడారని అన్నారు.