: కన్నీరు పెట్టుకున్న నైట్ రైడర్స్ చీర్ గాల్స్... ఓదార్చిన షారూక్


కోల్ కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో తన జట్టు ఒటమి పాలైన తరువాత, చీర్ గాల్స్ కన్నీరు కార్చడంపై జట్టు యజమాని షారూక్ ఖాన్ స్పందించారు. వారిని ఓదార్చుతూ ట్వీట్లు చేశారు. క్రీడాభిమానులను బాగా అలరించాలని తానెన్నడూ చీర్ గాల్స్ కు చెప్పలేదని అంటూ, జట్టు ఓటమి తనతో పాటు వారినీ బాధించి వుండవచ్చని, 'థ్యాంక్యూ అండ్ లవ్యూ గాల్స్' అని అన్నాడు. బాగా ఆడుతూ వచ్చిన తమ జట్టు, ఈ మ్యాచ్ లో సరిగ్గా ఆడలేకపోయిందని అభిప్రాయపడుతూ, హైదరాబాద్ జట్టుకు 'ఆల్ ది బెస్ట్' చెప్పాడు. వచ్చే సంవత్సరం జరిగే ఐపీఎల్ పోటీల కోసం వేచి చూస్తామని తెలిపాడు.

  • Loading...

More Telugu News