: నేను ఒకటంటే, వాళ్లు మరోటి రాశారు: దేవుళ్లపై వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ
దేవుళ్లు, దేవాదాయ శాఖ ఆదాయంపై తాను ఒక రకంగా మాట్లాడితే, మీడియాలోని ఓ వర్గం దాన్ని వక్రీకరించి రాసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు రెండో రోజున పాల్గొని ప్రసంగించిన ఆయన, తాను ఏ మతానికి చెందిన ప్రజలనూ కించపరచలేదని, తనకు ఆ ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. చెప్పిన మాటలను ఎప్పుడూ వక్రీకరిస్తుండే మీడియా గురించి అయితే ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. కలెక్టర్లకు ఉన్న విశేషాధికారాలతో, ప్రభుత్వ పాలన, అభివద్ధి ఫలాలు ప్రజల వద్దకు చేర్చేందుకు సహకరించాలని కోరారు. గ్రామస్థాయి అధికారుల మధ్య పోటీ పెరిగే వాతావరణం ఏర్పడేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు.