: వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ‘ఏపీ లాంజ్’... పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం
ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనమిక్ ఫోరం)లో ఈ దఫా ఓ కొత్త లాంజ్ కనిపించనుంది. ఏటా ఈ సదస్సులో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్ ‘ఏపీ లాంజ్’ పేరిట ఈ స్టాల్ ను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఏపీకి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ లాంజ్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 17న జరగనున్న ఈ సదస్సులో ఏపీ సర్కారు ఏర్పాటు చేస్తున్న ఈ లాంజ్ సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఈ సదస్సు స్విట్జర్లాండ్ నగరం దావోస్ లో జరగనున్న సంగతి తెలిసిందే.