: మొబైల్స్ తయారీకి మైక్రోసాఫ్ట్ గుడ్ బై!... 1,850 మంది ఉద్యోగులపై వేటు!


సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్మార్ట్ ఫోన్ల తయారీకి గుడ్ బై చెప్పేసింది. మొబైల్ ఫోన్ల తయారీలో పేరెన్నికగన్న ఫిన్ ల్యాండ్ కంపెనీ నోకియాను కొనుగోలు చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంది. నోకియా స్మార్ట్ ఫోన్ వెర్షన్లు లూమియా, ఆ తర్వాత విండోస్ ఫోన్ల వ్యూహాలు దెబ్బతిన్న నేపథ్యంలో అలవాటు లేని వ్యాపారాల నుంచి తప్పుకునేందుకే మైక్రోసాఫ్ట్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్న 1,850 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. వీరిలో నోకియా నుంచి తమ కంపెనీలో చేరిన ఉద్యోగులే 1,350 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా నోకియా సొంత దేశం ఫిన్ ల్యాండ్ లో పనిచేస్తున్నవారే అధికంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News