: ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీ... కాసేపట్లో ఢిల్లీలో వేడుకలు


భారత ప్రధానమంత్రిగా బీజేపీ నేత నరేంద్ర మోదీ నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలకు షాకిచ్చిన మోదీ.. తన సమ్మోహనాస్త్రాలతో దేశంలో మూడు దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాని రీతిలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మిత్రపక్షాల సాయం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు సాధించిన మోదీ... ఆ తర్వాత మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్ల పాలనలో తనదైన శైలిలో సరికొత్త తరహాలో పాలనను సాగించిన మోదీ... మంచి పనితీరునే కనబరిచారు. మోదీ ప్రధానిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరికాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలో భారీ వేడుకలకు తెర లేవనుంది. స్వయంగా నరేంద్ర మోదీనే ఈ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు.

  • Loading...

More Telugu News