: పార చేతబట్టిన అశోక్ గజపతిరాజు!... ఢిల్లీ అధికారిక నివాసంలో ఇంకుడు గుంత తవ్విన కేంద్ర మంత్రి
టీడీపీ సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు నిన్న పలుగు, పార చేతబట్టారు. ఢిల్లీలోని తన అధికారిక నివాస ప్రాంగణంలో తన సతీమణి సునీలతో కలిసి ఆయన పార చేతబట్టి ప్రత్యక్షమయ్యారు. వాననీటి సంరక్షణ దిశగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇంకుడు గుంతల తవ్వకానికి ఆయన తన మద్దతు పలికారు. ఈ బృహత్కార్యానికి కేవలం మద్దతు పలకడమే కాకుండా ఆయన స్వయంగా ఇంకుడు గుంతను కూడా తవ్వారు.