: ఆకట్టుకున్న సన్ రైజర్స్...కోల్ కతా లక్ష్యం 163


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా మొహాలీ వేదికగా జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు ఆకట్టుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాదుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (10) ను కోల్పోయింది. ఈ దశలో వార్నర్ (28) కు జతగా బ్యాటింగ్ దిగిన హెన్రిక్స్ (31) దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ వరుస బంతుల్లో పెవిలియన్ కు చేరడంతో సన్ రైజర్స్ ఇబ్బందుల్లో పడింది. అనంతరం యువరాజ్ సింగ్ (44), దీపక్ హుడా (21) ఇన్నింగ్స్ కు మరమ్మతులు చేశారు. భారీ షాట్లతో ఆకట్టుకున్నారు. హుడా రనౌట్ అయిన తరువాతి బంతికే కట్టింగ్ (0) పెవిలియన్ చేరాడు. దీంతో మళ్లీ కుదుపు. అనంతరం యువీ, నమన్ ఓజా (7), భువనేశ్వర్ కుమార్ (1) పెవిలియన్ చేరారు. చివర్లో బిపుల్ శర్మ (14) మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కోల్ కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో రాణించగా, అతనికి మోర్నీ మోర్కెల్, జాసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీసి సహకరించారు.

  • Loading...

More Telugu News