: యూపీ, ఉత్తరాఖండ్, గుజరాత్ లలో విజయం మాదే: అమిత్ షా ధీమా


ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు తమ ఖాతాలో చేరుతాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, 2017లో ఉత్తరప్రదేశ్‌ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని అన్నారు. అలాగే ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న గుజరాత్‌ లో అధికారం నిలబెట్టుకుంటామని ఆయన చెప్పారు. యూపీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు రాష్ట్రాలకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా తామే విజయం సాధిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News