: కాలి బొటనవేళ్లపై వెంట్రుకలు లేకపోతే ప్రమాదమేనట!


కాలి బొటనవేళ్లపై వెంట్రుకలు లేకపోవడానికి, గుండె సంబంధిత వ్యాధులకు సంబంధముందట. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. డాక్టర్ ఓజ్ చెప్పిన వివరాల ప్రకారం, కాలి బొటనవేళ్లపై వెంట్రుకలు లేకపోతే సదరు వ్యక్తి గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా చెప్పవచ్చన్నారు. ఈ విషయాన్ని ఆయన వివరించి చెప్పారు. గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు ధమనుల ద్వారా రక్తం సరఫరా అవుతుంది. ఇతర శరీర భాగాలతో పోలిస్తే గుండె నుంచి పాదాలు దూరంగా ఉండటంతో రక్త ప్రసరణ కూడా తక్కువగానే ఉంటుందట. గుండె నుంచి రక్తం తీసుకువెళ్లే ధమనుల పని తీరు సక్రమంగా లేకపోతే, అంటే, ఏవైనా అడ్డంకులు ఏర్పడితే కనుక బొటనవేలు ప్రాంతానికి రక్తం సరఫరా సరిగ్గా ఉండదు. దీని ప్రభావంతో బొటనవేలుపై వెంట్రుకలు ఉండవని డాక్టర్ ఓజ్ వివరించారు. ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News