: రాజ్యసభకు జెఠ్మలానీ...లాలూ కొత్త వ్యూహం


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సరికొత్త వ్యూహం రచించారు. ప్రధాని మోదీకి చెక్ చెప్పడంలో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడడంతో ఆయనకు అడ్డుకట్ట వేసేందుకు సమర్ధుడైన వ్యక్తిని రంగంలోకి దించుతున్నారు. మోదీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీని రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. గతంలో మోదీకి మద్దతిచ్చిన జెఠ్మలానీ కాలక్రమంలో ఆయనతో విభేదించి, ఆయనపై బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానిపై, కేంద్రంపై పోరాటానికి ఆయనే సరైన వ్యక్తి అని ఆర్జేడీ అధినేత లాలూ భావిస్తున్నారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయనతోపాటు తన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని కూడా రాజ్యసభకు పంపనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

  • Loading...

More Telugu News