: బంగ్లా క్రికెటర్ బలహీనతలను బయటపెట్టిన సహచరుడు


ఐపీఎల్ సీజన్ 9లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేసిన బంగ్లా సంచలనం ముస్తాఫిజుర్ రెహ్మాన్ 14 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. దిగ్గజాలనదగ్గ బ్యాట్స్ మన్ కు సైతం కొరకరానికొయ్యగా తయరైన ముస్తాఫిజర్ బలహీనతలను అతని సహచరుడు, సన్ రైజర్స్ హైదరాబాదు టీమేట్ రికీ బుయ్ బయటపెట్టాడు. బంతితో అద్భుతాలు చేసే ఈ యువ బౌలర్ ను రెండు విషయాలు ఆందోళనలో పడేస్తాయట. ఒకటి బ్యాటింగ్ కు దిగాల్సి రావడం అయితే, రెండోది ఇంగ్లిష్ లో మాట్లాడటం. ముస్తాఫిజుర్ ను ఈ రెండు విషయాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తాయని రికీ బుయ్ తెలిపాడు. బెంగాలీలో ముస్తాఫిజర్ బౌలింగ్ ప్లాన్ తనకు చెబితే, దానిని తాను స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ కు వివరిస్తానని రికీ బుయ్ తెలిపాడు. దీంతో మిగిలిన విషయాలన్నీ క్రమపద్ధతిలో జరిగిపోతాయని రికీ బుయ్ చెప్పాడు.

  • Loading...

More Telugu News