: ఉత్తరాఖండ్ లో తెలుగు యాత్రికుల ఇబ్బందులు!


చార్ ధామ్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులను హరిద్వార్ కు చెందిన జీకే ట్రావెల్స్ నిర్వాహకులు మోసగించడంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర కాశీ నుంచి కేదార్ నాథ్ కు వెళ్లేందుకని నిన్న సాయంత్రం ఒక్కొక్క ప్రయాణికుడి నుంచి రూ.8,300 చొప్పున వసూలు చేసిందని, ఆ తర్వాత వారు కనపడకుండా పోయారని యాత్రికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై రుద్ర ప్రయాగలోని ఉత్తర కాశీ పోలీసు స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి శ్రీనివాసన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ట్రావెల్స్ యజమాని ముత్తూబాయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, బాధిత యాత్రికుల్లో గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.

  • Loading...

More Telugu News