: పండిట్లు, సైనికుల కాలనీలను వ్యతిరేకిస్తూ ఏకమైన వేర్పాటు వాదులు...గంటన్నర సమావేశం


వారందరికీ భారతదేశం అంటే అంతులేని కసి, పాకిస్థాన్ అంటే అంతులేని ప్రేమ...తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకానికి చెందే నేతలు. భారతదేశంలో ఉంటూ జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారికి మద్దతిచ్చే జమ్మూకాశ్మీర్ వేర్పాటు వాద సంఘాల నేతలైన వీరంతా ఇప్పుడు ఒక్కటయ్యారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని అమలు చేస్తూ వారంతా ఏకం కావడం విశేషం. ఇదిలా ఉంచితే, ఒకప్పుడు ఉగ్రవాదుల దాడులకు భయపడి జమ్మూకాశ్మీర్ నుంచి తలోదిక్కుకూ పారిపోయిన కాశ్మీరీ పండిట్లకు, మాజీ సైనిక ఉద్యోగులకు కాలనీలు నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఇలాంటి కాలనీలు నిర్మించడం వల్ల తీవ్రవాదులపై పోరాడిన సైనికులకు రక్షణ, కాశ్మీరీ వేర్పాటు వాద ముస్లింల నుంచి పండిట్లకు భద్రత దొరుకుతుందని ప్రభుత్వ ఆలోచన. ఇలా జరిగితే క్రమంగా కాశ్మీర్ పై పట్టుచిక్కే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు వర్గాలకు భద్రత లభిస్తే, తాము బలహీనపడడం తధ్యమని గ్రహించిన వేర్పాటు వాద నేతలంతా ఏకమయ్యారు. ఈ కాలనీలను అడ్డుకునే దిశగా పావులు కదిపేందుకు వేర్పాటు వాద నేతలు సయ్యద్ గిలానీ, మీర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ సమావేశమయ్యారు. సుమారు గంటన్నరపాటు సమావేశమైన వీరు గురువారం బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. శుక్రవరం శాంతియుత నిరసనలు తెలపాలని సూచించారు. ముస్లింల అస్తిత్వం, వ్యక్తిత్వాలను పరిరక్షించుకోవాలని వారు పిలుపునిచ్చారు. సిద్ధాంతాలపరంగా భిన్న ధ్రువాలవంటివారైన వీరు 2008 తరువాత ఏకంకావడం ఇదే తొలిసారి. 2008లో అమరనాథ్ యాత్రీకులకు భూములు కేటాయింపులకు వ్యతిరేకంగా వీరంతా ఏకమయ్యారు. మళ్లీ ఇప్పుడు పండిట్లు, మాజీ సైనికులకు కాలనీలు నిర్మించడానికి వ్యతిరేకంగా ఏకమయ్యారు.

  • Loading...

More Telugu News