: డొనాల్డ్ ట్రంప్ ప్రచార ర్యాలీకి వ్యతిరేకంగా రచ్చ రచ్చ చేసిన ఆందోళనకారులు


అమెరికా అధ్యక్ష ప‌ద‌వి రేసులో దూసుకుపోతోన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నిన్న తన ప్రచారంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన వ్యతిరేకులు రచ్చ రచ్చ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప‌లు వ‌స్తువులకు నిప్పంటించి ఇష్టం వచ్చిన‌ట్లు విసిరేశారు. అక్క‌డి బారికేడ్ల‌ను తీసి పారేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆందోళ‌న కారుల‌ను అదుపు చేయ‌డానికి పోలీసులు నానా తంటాలు ప‌డ్డారు. పోలీసుల‌పై ఆందోళ‌న కారులు రాళ్లు, బాటిళ్లు విసిరారు. వారిని చెద‌ర‌గొట్ట‌డానికి అక్క‌డి పోలీసులు పెప్పర్‌ స్ప్రే ఫైర్ చేశారు. స్మోక్‌ గ్రనేడ్లు కూడా విడిచారు. ఆందోళ‌న‌తో అక్క‌డి ప్రాంతం అస్త‌వ్య‌స్తం అవుతుండ‌గా మ‌రోవైపు ట్రంప్ మాత్రం అక్కడి అల్బుకెర్క్‌ కన్వెన్షన్‌లో త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగించారు.

  • Loading...

More Telugu News