: చొరబడిన ఉగ్రవాదులు, ఎల్ఓసీ వెంట జల్లెడపడుతున్న సైన్యం!


పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న విశ్వసనీయ సమాచారంతో, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన సైన్యం జల్లెడ పడుతోంది. రెండు రోజుల క్రితం హిజబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు సైన్యంపై దాడి చేసి ముగ్గురిని హత్య చేసిన తరువాత, మరిన్ని చొరబాట్లకు అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించగా, భారీ ఎత్తున ఆయుధాలతో చొరబడ్డారని తెలుస్తోంది. సరిహద్దులకు ఆవల తగు సమయం కోసం మరింత మంది వేచిచూస్తున్నారని కూడా సమాచారం అందగా, పోలీసులు, భద్రతాదళాలు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి సోదాలు జరుపుతున్నారు. గడచిన మూడు రోజుల్లో సైన్యంపై రెండు దాడులు జరిగిన నేపథ్యంలో పూర్తి అలర్ట్ గా ఉన్నట్టు సైనికాధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News