: బాబుగారూ... చతురత చూపండి, ‘హోదా’ తీసుకురండి!: చంద్రబాబుకు కేవీపీ లేఖ


ఏపీకి ప్రత్యేక హోదా సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మొన్నటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రతిపాదించిన కేవీపీ పెద్ద చర్చకే తెర తీశారు. కేవీపీ దెబ్బకు డంగైన నరేంద్ర మోదీ సర్కారు.... ఆ బిల్లును చర్చకు రాకుండానే అడ్డుకోగలిగింది. అయితే తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రాక తప్పదు. ఈ నేపథ్యంలో కేవీపీ.. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి కొద్దిసేపటి క్రితం ఓ లేఖ రాశారు. రాష్ట్ర విభజనతో సమస్యల్లో చిక్కుకున్న ఏపీ గట్టెక్కాలంటే ప్రత్యేక హోదా ఆవశ్యమని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు. ఇక చంద్రబాబుకు ఢిల్లీలో మంచి పలుకుబడి ఉందని చెప్పిన కేవీపీ... తన చతురతను చూపి ప్రత్యేక హోదా సాధించాలని చంద్రబాబుకు సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తాను ప్రతిపాదించిన ప్రైవేట్ బిల్లు చర్చకు వస్తుందని, అప్పుడు అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా మద్దతిచ్చి హోదాను సాధించేలా కృషి చేయాలని కూడా కేవీపీ ఆ లేఖలో చంద్రబాబుకు సూచించారు.

  • Loading...

More Telugu News