: ఇరాన్ తో భారత్ డీల్ ను ప్రశ్నిస్తున్న అమెరికా


ఇరాన్ తో క్రూడాయిల్ సరఫరాకు డీల్ కుదుర్చుకుని చాబహార్ సమీపంలో నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ నిర్ణయించుకోవడాన్ని అమెరికా సెనెటర్ ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుతో అంతర్జాతీయ నిబంధనల అతిక్రమణ జరుగుతోందని, తమ అధికారులు ఈ ప్రాజెక్టును నిశితంగా పరిశీలిస్తున్నారని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహ కార్యదర్శి నిషా దేశాయ్ బిస్వాల్ తెలిపారు. ఇరాన్ తో బంధాన్ని పెంచుకునే విషయమై, భారత్ హద్దుల్లో ఉండాలన్నదే తమ అభిమతమని ఆమె స్పష్టం చేశారు. చాబహార్ ప్రకటనను పరిశీలిస్తున్నామని, దీన్ని సెనెట్ విదేశీ వ్యవహారాల కమిటీకి పంపనున్నామని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం తన ఇరాన్ పర్యటనలో భాగంగా, దాదాపు రూ. 3,300 కోట్ల అంచనా వ్యయంతో చాబహార్ పోర్టును అభివృద్ధి చేసి క్రూడాయిల్ సరఫరాను మరింత సులువు చేసుకునే దిశగా డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News