: అంతా అబద్ధం... మా ఫైటర్ హెలికాప్టర్లకు ఏం కాలేదు: ఐఎస్ఐఎస్ దాడిపై రష్యా


సిరియాలో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ దాడిలో తమ దేశానికి చెందిన యుద్ధ హెలికాప్టర్లు, ట్రక్కులు తుక్కుతుక్కైపోయాయని వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. సిరియా బేస్ లో తమ ఫైటర్ చాపర్లు, ట్రక్కులు పూర్తి భద్రంగా ఉన్నాయని, రోజూలాగానే ఉగ్రవాదులను ఏరివేసే పనిలో ఉన్నాయని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కోనాషెంకోవ్ వ్యాఖ్యానించారు. ఐఎస్ఐఎస్ కు అంత సీను లేదని, వారు ఎలాంటి దాడులు చేసే స్థితిలో లేరని, ఏ ఒక్క తమ సైనికుడికీ గాయాలు కాలేదని వివరించారు. కాగా, సిరియా బేస్ పై దాడి చేసిన ఐఎస్ఐఎస్ హెలికాప్టర్లను ధ్వంసం చేసిందని శాటిలైట్ చిత్రాలను చూపుతూ బీబీసీ వార్తా కథనాలను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News