: మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్... రేపు వైసీపీ అభ్యర్థిగా రాజ్యసభకు విజయసాయి నామినేషన్
రెండేళ్ల క్రితం ఇచ్చిన మాటను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని పంపుతామన్న మాటను జగన్ నిలబెట్టుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థిగా విజయసాయిని నిన్న జగన్ ఖరారు చేశారు. దీంతో రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. విజయసాయిని వెంటబెట్టుకుని అసెంబ్లీకి వెళ్లనున్న జగన్... ఆయనతో నామినేషన్ వేయిస్తారట. ఈ కార్యక్రమానికి పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అందరూ హాజరవుతున్నారు. రెండేళ్ల క్రితం రాజ్యసభ అవకాశంపై చర్చ సందర్బంగా విజయసాయికే సీటిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే అప్పటికే పార్టీలో ఉన్న సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి టికెట్ ఆశించినా... జగన్ మాత్రం విజయసాయి వైపే మొగ్గుచూపారు.