: కోహ్లీ, రాహుల్ డకౌట్...గేల్, వాట్సన్ సింగిల్ డిజిట్ కే అవుట్...కష్టాల్లో బెంగళూరు


ఐపీఎల్ సీజన్ 9లో భాగంగా జరుగుతున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గుజరాత్ ఆటగాళ్లు ఆకట్టుకున్నారు. 159 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు చుక్కలు చూపించారు. మూడో ఓవర్ లో ధావల్ కులకర్ణి కోహ్లీని డకౌట్ చేసి పెవిలియన్ కు పంపితే...ఒక షాట్ తో అలరించిన గేల్ (9) మళ్లీ నిరాశపరిచాడు. అనంతరం వచ్చిన రాహుల్ (0) కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన షేన్ వాట్సన్ (1)ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. తరువాత దిగిన సచిన్ బేబీ (0)ని ధావల్ కులకర్ణి పెవిలియన్ కు పంపాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేవలం 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో డివిలియర్స్ (13), స్టువర్ట్ బిన్నీ (1) ఉన్నారు.

  • Loading...

More Telugu News