: రెజ్లర్ నుంచి కిక్ బాక్సర్ గా మారిన సుల్తాన్... దుమ్మురేపిన సల్మాన్ ట్రైలర్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'సుల్తాన్' సినిమా ట్రైలర్ ను సల్లూభాయ్ విడుదల చేశాడు. ఐపీఎల్ లో భాగంగా సెట్ మాక్స్ నిర్వహించే ఎక్స్ ట్రా ఇన్నింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్, అనుష్కలు సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ వీడియో లింక్ ను సోషల్ మీడియా ద్వారా సల్మాన్ విడుదల చేశాడు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఆదిత్యా చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ రూపొందుతున్న ఈ సినిమాలో సల్మాన్, అనుష్కల పాత్రలను ఇంతకు ముందే టీజర్ రూపంలో విడుదల చేయగా, ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రెజ్లర్ 'సుల్తాన్' కిక్ బాక్సర్ గా మారిన వైనాన్ని ట్రైలర్ లో చూపించారు. సల్మాన్ అభిమానులను ఆకట్టుకునేలా ట్రైలర్ ఉండడం విశేషం.