: భారత్ లో పెరిగిపోతున్న అత్యాచారాలకు గాంధీ, నెహ్రూ కుటుంబాలదే బాధ్యత: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు


రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ లో పెరిగిపోతున్న అత్యాచారాలకు గాంధీ, నెహ్రూ కుటుంబాలే బాధ్యత వహించాలంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ కుటుంబానికి చెందిన నేతల విగ్రహాల్ని, స్మారక కట్టడాల్ని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ హయాంలో దేశంలో మూఢాచారాలు త్వరలోనే పోతాయని, మోదీ ఒక గొప్ప వ్యక్తి అంటూ ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు. కాగా, అహూజా తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. అహూజా మానసిక పరిస్థితి సరిగ్గాలేదని, పిచ్చాసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News