: ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం...గ్రౌండ్ లో మరణించిన ఆటగాడు


ఫుట్ బాల్ మ్యాచ్ లో విషాదం చోటుచేసుకుంది. గ్రౌండ్ లో ఆటగాడు మరణించడం కలకలం రేపుతోంది. ఫుట్ బాల్ మ్యాచ్ లలో ఆటగాళ్లు ఊపిరి అందక, ఒత్తిడి తట్టుకోలేక మరణించడం సాధారణంగా జరుగుతుంది. అయితే అందుకు భిన్నంగా అర్జెంటీనాలో క్లబ్ స్థాయిలో జరుగుతున్న మ్యాచ్ లో బంతి కోసం పోటీపడుతూ ఇద్దరు ఆటగాళ్లు పరుగెత్తారు. బంతిని అందుకునే క్రమంలో ఒక ఆటగాడి కాలికి మరో ఆటగాడు తగలడంతో కిందపడ్డాడు. రెండో ఆటగాడు బంతిని అందుకునే క్రమంలో నియంత్రించుకోలేక అతని తలను బలంగా షూతో తన్నేశాడు. దీంతో ఇద్దరూ లేచి వాదించుకునే క్రమంలో మరో ఆటగాడు వచ్చి, బాధిత ఆటగాడిని బలంగా తోసేశాడు. అప్పటికే తలకు బలమైన దెబ్బతిని ఉన్న ఆటగాడు, అలా తోయడంతో కిందపడి మరలా లేవలేదు. దీంతో అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. దీంతో ఫుట్ బాల్ క్రీడాకారుల్లో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News