: ప్రియాంకా చోప్రా లుక్ తో రానున్న ‘బేవాచ్‌’ పోస్టర్!


బాలీవుడ్ న‌టి ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం అక్క‌డ‌ ‘బేవాచ్‌’ సినిమాలో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ప్రియాంక చోప్రా ‘బేవాచ్‌’లో విల‌న్ రోల్‌లో న‌టిస్తోంది. మ‌రోవైపు అమెరిక‌న్ సీరియ‌ల్‌ క్వాంటికో-2 సిరీస్ కోసం కూడా ప్ర‌య‌త్నిస్తోంది. అయితే నెల రోజుల క్రితం ‘బేవాచ్‌’ హీరో హాలీవుడ్‌ స్టార్‌ డ్వెయిన్‌ జాన్సన్ త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతా ద్వారా షేర్ చేసిన సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ప్రియాంక చోప్రా క‌నిపించక‌పోవ‌డం ఆ అమ్మ‌డి అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. అయితే ‘బేవాచ్‌’ చిత్ర యూనిట్ ప్రియాంక చోప్రా కోసం ప్ర‌త్యేకంగా ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేయాల‌ని చూస్తోంద‌ట. చిత్ర యూనిట్ నుంచి ఈ వార్త రాగానే ఆమె అభిమానులు ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్నారు. ప్రియాంక చోప్రా ‘బేవాచ్‌’లో ఎలా క‌న‌ప‌డ‌నుందోన‌ని ఎదురుచూస్తున్నారు. కాగా, ప్రియాంక చోప్రా మ‌ళ్లీ బాలివుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, హాలీవుడ్ తో పాటు ఇక్కడ కూడా కొనసాగాలని చూస్తోంది.

  • Loading...

More Telugu News