: నేను చెప్పే వరకు పెళ్లి మాట ఎత్తకండి: సమంత


'నేను సింగిల్ గా ఉంటున్నానని ఎవరు చెప్పారు?' అని ప్రశ్నించి, ప్రేమలో ఉన్నానని చెప్పిన తమిళ ముద్దుగుమ్మ సమంత పెళ్లిపై వస్తున్న దుమారానికి అడ్డుకట్టవేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో తన పెళ్లిపై ప్రసారం చేస్తున్న వార్తలను ఆపాలని ఆమె కోరుతోంది. తన పెళ్లి గురించి తాను చెప్పేంత వరకు ఏమీ రాయవద్దని కోరింది. తన పెళ్లి వార్తను తానే చెబుతానని, తాను చెప్పిన తరువాత రాసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, గతంలో తమిళ నటుడు సిద్ధార్థ్ తో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన సమంత, అతనికి దూరమైన తరువాత టాలీవుడ్‌ నటుడితో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగనున్నాయని కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. కాగా, నితిన్‌ తో ఈ ముద్దుగుమ్మ జంటగా నటించిన ‘అ..ఆ' సినిమా జూన్‌ 2న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News