: 30 నెలల్లో సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయండి: అధికారులకు హరీశ్‌రావు ఆదేశం
తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఈరోజు సంబంధిత అధికారులతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని, 30 నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రాజెక్టులో పాలుపంచుకుంటోన్న అధికారులు అందరూ సమన్వయంతో పనిచేయాలని, వారానికోసారి పనుల పురోగతిపై సమీక్షించాలని ఆయన సూచించారు.