: 'సులభ్' కాంప్లెక్స్ కు బాలీవుడ్ నటుడు రిషికపూర్ పేరు!


కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై ఇటీవల విమర్శలు గుప్పించిన బాలీవుడ్ నటుడు రిషికపూర్ కు ‘హస్తం’ పార్టీ షాక్ ఇచ్చింది. దేశంలోని రోడ్లు, భవనాలు, ఎయిర్ పోర్టులకు నెహ్రూ కుటుంబాలకు చెందిన వారి పేర్లే పెడుతున్నారని, ఇవేమన్నా వారి అబ్బ సొత్తా అని, అవసరమైతే తన తండ్రి రాజ్ కపూర్ పేరు లేదా తన పేరు పెట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయిలోని శివాజీ పార్క్ వద్ద ఉన్న సులభ్ కాంప్లెక్స్ కు రిషికపూర్ పేరు పెట్టి కాంగ్రెస్ తమ నిరసన తెలిపింది. మరోసారి నెహ్రూ కుటుంబంపై విమర్శలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా హెచ్చరించారు.

  • Loading...

More Telugu News