: జూన్ 4న కర్ణాటకలో సామూహిక సెలవు పెట్టనున్న పోలీసులు!


పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పోలీసులందరూ మూకుమ్మడిగా సెలవు పెట్టనున్నారు. కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న పోలీసుల సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని పోలీసులు జూన్ 4వ తేదీన సామూహిక సెలవుపై వెళ్లేందుకు అఖిల కర్ణాటక పోలీసు మహా సంఘం నిర్ణయించింది. అయితే, నిరసనలు, ఆందోళనలు చేయకుండా ప్రశాంతంగా తమ సమస్యలను సాధించుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని వారు చెబుతున్నారు. పోలీసులకు మద్దతుగా రైతు, కార్మిక, విద్యార్థి సంఘాలు, పోలీసు కుటుంబీకులు జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపి జిల్లా అధికారులకు తమ వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా, ఈ నెల 13న రాష్ట్ర హోం హంత్రి పరమేశ్వరన్, డీజీపీలకు అఖిల కర్ణాటక పోలీసు మహా సంఘం అధ్యక్షుడు శశిధర్ లేఖలు రాశారు. పోలీసు స్టేషనల్లో సిబ్బంది కొరత, వారానికి ఒకరోజు సెలవు లభించకపోవడం, అధిక గంటలు పనిచేయాల్సి రావడం, పై అధికారుల వేధింపులు, వేతనాలలో వ్యత్యాసం, మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయనాయకుల ప్రభావం, అభద్రతా భావం వంటి పలు సమస్యలతో పోలీసులు సతమతమవుతున్నారని, వీటికి పరిష్కారం చూపించాలని కర్ణాటక పోలీసు మహాసంఘం కోరింది.

  • Loading...

More Telugu News