: తాజ్ మహల్ రంగు ఎందుకు అలా మారుతుందో కనుక్కోండి: అధికారులకు సీఎం అఖిలేశ్‌ ఆదేశం


ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ చిహ్నం తాజ్‌ మహల్‌ రంగు మార్పుపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆగ్రా డివిజినల్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌, ప్రజా పనుల విభాగం, పురావస్తు శాఖ, కాలుష్య బోర్డు అధికారులతో సమావేశమైన ఆయన, తాజ్‌ మహల్‌ ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతోందో కారణం కనిపెట్టాలని, పాలరాయి రంగు మారకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాజ్‌ మహల్‌ అందం కాపాడేందుకు, దాని భద్రతకు యూపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. కాగా, తాజ్‌ మహల్‌ మార్బుల్స్ పై ఆకుపచ్చ చారలు ఏర్పడుతున్నాయి. దీంతో తాజ్ ఆకుపచ్చగా కనిపించి, దాని అందం దెబ్బతింటోంది. దీనికి కారణం ఈ అద్భుత కట్టడం పక్కనే ఉన్న యమునా నది నీరు తీవ్రమైన కలుషితమైందని, దీనిలోని క్రిమికీటకాలు తాజ్‌ మహల్‌ పైకి చేరి, విడుదల చేస్తున్న వ్యర్థాల కారణంగా దానిపై ఆకుపచ్చ చారలు ఏర్పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News