: 30 ఏళ్ల ప్రేమ...మరో 30 ఏళ్లు ఇలాగే లాగించేస్తా: నాగార్జున


ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జున సినీ ప్రస్థానం మొదలై నేటికి 30 ఏళ్లు పూర్తైంది. దీనిని నాగార్జున గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌ ద్వారా అభిమానులను పలకరించారు. ఈ 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేయించేందుకు సహకరించిన కుటుంబం, స్నేహితులు, అభిమానులలకు ధన్యవాదాలు తెలిపారు. ఇందరి అభిమానం ఆదరణతో 30 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్నానని, మరో 30 ఏళ్లు ఇలా లాగించేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన ట్వీట్‌ చేశారు. ఇలాంటి అద్భుతమైన క్షణాల్లో తన తల్లిదండ్రులను మిస్ అవుతున్నానని నాగార్జున ఆవేదన వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News