: భారత్‌, ఇరాన్ మ‌ధ్య దోస్తీ ఇప్ప‌టిది కాదు.. ఎప్ప‌టినుంచో ఉంది: టెహ్రాన్ లో మోదీ


'భారత్‌, ఇరాన్ మ‌ధ్య దోస్తీ ఇప్ప‌టిది కాదు.. ఎప్ప‌టినుంచో ఉంది’ అని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ఇరాన్ లో పర్యటించడం గర్వంగా భావిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. త‌న రెండురోజుల ఇరాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా టెహ్రాన్‌లో ఈరోజు ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహానీతో భేటీ అయిన మోదీ..ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2001లో గుజరాత్‌లో భూకంపం వచ్చినప్పుడు ఇత‌ర దేశాల‌తో పాటు ఇరాన్ చేసిన సాయం మరువలేనిదని అన్నారు. ఈరోజు భార‌త్‌, ఇరాన్ మ‌ధ్య జ‌రిగిన ఒప్పందం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌ మ‌ధ్య కొత్త అధ్యాయం సృష్టిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఒప్పందంలో టూరిజం అంశానికి ప్రాధాన్య‌త ఇచ్చామ‌న్నారు. ఇరు దేశాల మ‌ధ్య శాస్త్ర, సాంకేతిక అంశాల స‌మ‌న్వ‌యం జ‌ర‌గ‌నుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News